Venkatrami Reddy: ప్రభుత్వం మారితే పోలీసులను కాపాడేదెవరు?.. వెంకట్రామిరెడ్డి హెచ్చరిక

Reddy questions who will protect police after new government
  • ఏపీ పోలీసులకు ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర హెచ్చరికలు
  • జగన్ కారు ప్రమాదంపై తప్పుడు కేసు పెడితే పరిణామాలు తప్పవని వార్నింగ్
  • పోలీసు వ్యవస్థ నీచస్థాయికి దిగజారిందని ఘాటు విమర్శలు
  • ఉద్యోగుల సమస్యల పేరుతో సమావేశం పెట్టి రాజకీయ విమర్శలు
  • మాజీ సీఎం జగన్‌ను ఆకాశానికెత్తిన వెంకట్రామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారంటూ నేరుగా హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. ఆదివారం ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కారు ప్రమాదం కేసు దర్యాప్తును ప్రస్తావిస్తూ వెంకట్రామిరెడ్డి పోలీసుల తీరును తప్పుబట్టారు. "గుంటూరులో జరిగిన కారు ప్రమాదంపై ఎస్పీ మొదట ఒకలా చెప్పారు, రెండు రోజులకే మాట మార్చారు. రేపు ప్రభుత్వం మారుతుంది. ఒకవేళ ఇది తప్పుడు కేసు అని తేలితే పోలీసులను ఎవరు కాపాడతారు?" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దరిద్రంగా, నీచస్థాయికి దిగజారిందని విమర్శించారు.

గతంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారన్న ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డి ఇప్పుడు కూడా జగన్‌కు మద్దతుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగుల సమస్యల కోసం పెట్టిన సమావేశాన్ని ఆయన రాజకీయ వేదికగా మార్చుకున్నారు. గత వైసీపీ హయాంలో ఓ ఐఏఎస్ అధికారి ఉద్యోగులను చిన్న మాటంటే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రే క్షమాపణ చెప్పారంటూ జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 11వ పీఆర్సీ, జీపీఎస్ వంటి విధానాలతో ఉద్యోగులకు జగన్ ఎంతో మేలు చేశారంటూ ఆయన వైసీపీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు.
Venkatrami Reddy
AP Employees Association
Andhra Pradesh
Police
Jagan Mohan Reddy
Guntur Car Accident
YCP
Government Employees
Political Controversy

More Telugu News