Kavitha: ఎమ్మెల్సీ కవితతో ఈటల రాజేందర్ కీలక అనుచరుడి భేటీ!!

Kavitha Meeting with Etela Rajender Key Supporter Sparks Speculation
  • ఎమ్మెల్సీ కవితతో భేటీ అయిన మేడ్చల్ బీజేపీ నేత రామిడి వెంకట్ రెడ్డి
  • వెంకట్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి జాగృతిలో చేరతారనే ప్రచారం
  • ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ గా రాంచందర్ రావు నియామకం
మేడ్చల్‌కు చెందిన బీజేపీ నేత రామిడి వెంకట్ రెడ్డి మల్కా‌జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటలకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన ఆశించగా... అధిష్ఠానం అనూహ్యంగా రామచందర్ రావును ఎంపిక చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారని, బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ జాగృతిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయగా, ఇప్పుడు వెంకట్ రెడ్డి బాటలో మరికొంతమంది నేతలు పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఆ పార్టీ హైకమాండ్ రాంచందర్ రావును నియమించడం తెలిసిందే.

Kavitha
Etela Rajender
BRS
BJP Telangana
Telangana Politics
Ramachander Rao

More Telugu News