Virender Sehwag: డీపీఎల్ వేలంలో సెహ్వాగ్ కొడుకు, కోహ్లీ అన్న కొడుకు... ఎవరి ధర ఎంతంటే?

Virender Sehwag Son and Virat Kohli Nephew in DPL Auction
  • ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో క్రికెట్ దిగ్గజాల వారసులు
  • సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్‌ను రూ. 8 లక్షలకు దక్కించుకున్న సెంట్రల్ ఢిల్లీ కింగ్స్
  • కోహ్లీ అన్న కొడుకు ఆర్యవీర్‌ను రూ. లక్షకు కొనుగోలు చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్
  • ఈ ఇద్దరు ఆర్యవీర్ లపై అందరి దృష్టి
  • వేలంలో అత్యధికంగా రూ. 39 లక్షలు పలికిన పేసర్ సిమర్‌జీత్ సింగ్
  • రూ. 38 లక్షలతో రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచిన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ
భారత క్రికెట్ దిగ్గజాల వారసులు, తర్వాతి తరం ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 సీజన్ కోసం జరిగిన వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కొడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ యువ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి.

వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు 18 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రిలాగే ఓపెనింగ్ బ్యాటర్. ఇతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడగా, చివరకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు రూ. 8 లక్షలకు సొంతం చేసుకుంది. మరోవైపు విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడైన ఆర్యవీర్ కోహ్లీ ఒక లెగ్ స్పిన్నర్. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు రూ. 1 లక్షకు దక్కించుకుంది. ఆర్యవీర్ కోహ్లీ తన బాబాయ్‌కు శిక్షణ ఇచ్చిన రాజ్‌కుమార్ శర్మ వద్దే కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు డీపీఎల్ లో ఈ ఇద్దరు ఆర్యవీర్ లపై అందరి దృష్టి నెలకొంది.

ఈ డీపీఎల్ వేలంలో పేసర్ సిమర్‌జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆకట్టుకున్న మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ జట్టు రూ. 38 లక్షలకు సొంతం చేసుకుంది.
Virender Sehwag
Aryaveer Sehwag
Virat Kohli
Aryaveer Kohli
Delhi Premier League
DPL 2025

More Telugu News