8 Vasanthalu: అప్పుడే ఓటీటీలోకి వస్తున్న '8 వసంతాలు'

8 Vasanthalu Movie Update
  • ప్రేమకథా చిత్రంగా '8 వసంతాలు'
  • ప్రధానమైన పాత్రను పోషించిన అనంతిక
  • నెట్ ఫ్లిక్స్ వారికి స్ట్రీమింగ్ హక్కులు  
  • ఈ నెల 11 నుంచి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ 

ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు సైతం నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక చిన్న సినిమాల సంగతి చెప్పేదేముంటుంది. అలా థియేటర్లకు వచ్చి నాలుగు వారాలు కాకుండానే ఓటీటీలోకి అడుగుపెడుతున్న సినిమాగా '8 వసంతాలు' కనిపిస్తోంది. ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 20వ తేదీన థియేటర్లకు వచ్చింది.

అనంతిక సనిల్ కుమార్ .. హనురెడ్డి .. రవితేజ దుగ్గిరాల ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి హెషామ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని సమకూర్చాడు. రిలీజ్ కి ముందు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఫీల్ తో కూడిన లవ్ స్టోరీగా మార్కులు కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకనో ఆశించిన స్థాయిలో యూత్ కి రీచ్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ ఆడియోతో  ఈ సినిమా అందుబాటులోకు రానుంది. అయోధ్య అనే యువతి జీవితంలోకి వరుణ్ - సంజయ్ అనే ఇద్దరు యువకులు అడుగుపెడతారు. ఆమె జీవితాన్ని వాళ్లు ఎలా ప్రభావితం చేశారు? అనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా యూత్ హృదయాలు కొల్లగొడుతుందేమో చూడాలి. 
8 Vasanthalu
8 Vasanthalu movie
Phanindra Narishetti
Ananthika Sanilkumar
Netflix Telugu movies
Telugu OTT releases
Telugu romance movies
Hesham Abdul Wahab music

More Telugu News