PIMS Hospital: ఐసీయూలో శవాన్ని ఉంచి... రోజుకు లక్ష వసూలు చేసిన హాస్పిటల్

Pakistan hospital charged family for 7 days of ICU care after death
  • పాకిస్థాన్ లో దారుణ ఘటన
  • శవానికి ఏడు రోజుల పాటు చికిత్స
  • కుటుంబ సభ్యుల నుంచి రోజుకు లక్షల వసూలు
పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డబ్బు కోసం కక్కుర్తిపడి అమానుషానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రోగి చనిపోయిన తర్వాత కూడా, ఏకంగా ఏడు రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి కుటుంబసభ్యుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఇస్లామాబాద్‌లోని పిమ్స్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆరోగ్య ఉపసంఘం సమావేశంలో ఈ దారుణమైన విషయం బయటపడింది. కమిటీ సభ్యురాలు షైస్తా ఖాన్ ఈ ఆరోపణలు చేశారు. ఆమె కథనం ప్రకారం, ఓ రోగి పిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయినప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం ఆ మృతదేహాన్ని తమ ఐసీయూకి తరలించి, ఏడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచింది. ఈ కాలానికి గాను రోజుకు లక్ష రూపాయల చొప్పున కుటుంబం నుంచి వసూలు చేసినట్లు షైస్తా ఖాన్ ఆరోపించారు.

ఈ ఘటన ప్రైవేట్ వైద్య రంగంలో పర్యవేక్షణ లోపం, నైతిక విలువల పతనాన్ని ఎత్తిచూపుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. అయినప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 
PIMS Hospital
Islamabad
Pakistan hospital
ICU
patient death
medical negligence
Shaiasta Khan
National Assembly
health sub-committee
hospital bill

More Telugu News