Water from Air: గాలి నుంచి మంచినీళ్లు.. అద్భుత పరికరాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు!

Water from Air MIT Device Solves Water Crisis
  • గాలిలోని తేమ నుంచి మంచినీటిని తయారుచేసే టెక్నాలజీ
  • రోజుకు 6 లీటర్ల నీరు.. గాలి నుంచే ఉచితంగా మంచినీరు
  • అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
  • ఎడారి ప్రాంతాల్లో నీటి కొరతకు చక్కటి పరిష్కారం
నీటి కోసం భూమిని తవ్వాల్సిన అవసరం లేదు. ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన తాగునీటిని సులభంగా పొందవచ్చు. అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చారు. ఎలాంటి విద్యుత్ సహాయం లేకుండా కేవలం గాలిలోని తేమను గ్రహించి నీటిగా మార్చే ఒక ప్రత్యేక విండో ప్యానెల్‌ను అభివృద్ధి చేశారు.

ఈ పరికరం ద్వారా ప్రతిరోజూ దాదాపు 5 నుంచి 6 లీటర్ల స్వచ్ఛమైన మంచినీటిని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కరువు కాటకాల సమయంలో నీటి కొరతను నివారించడానికి ఇదొక గొప్ప మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎడారులు, నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ టెక్నాలజీ పనిచేసే విధానం చాలా సులభమైంది. ఈ ప్యానెల్‌లో తేమను పీల్చుకునే హైగ్రోస్కోపిక్ లవణాలు, గ్లిసరాల్‌తో కూడిన ఒక ప్రత్యేక హైడ్రోజెల్ పొర ఉంటుంది. ఇది రాత్రి సమయాల్లో గాలిలోని తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. పగలు సూర్యరశ్మి తగలగానే, ఆ వేడికి లోపల చిక్కుకున్న తేమ ఆవిరై, చల్లబడి స్వచ్ఛమైన నీటి బిందువులుగా మారుతుంది. విద్యుత్ గానీ, ఇతర యంత్ర పరికరాలు గానీ అవసరం లేకపోవడంతో దీనికి ఖర్చు చాలా తక్కువే అవుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
Water from Air
MIT
MIT Researchers
Drinking Water
Water Crisis
Air Humidity
Hydrogel
Hygroscopic Salts
Water Scarcity
Clean Water

More Telugu News