Shubman Gill: భారత్-ఇంగ్లాండ్ టెస్టు రెండో రోజు ఆటకు వాన గండం!

Shubman Gill India vs England Test Day 2 Rain Threat
  • ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితి
  • మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ 3 వికెట్లకు 359 పరుగులు
  • రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సూచనలు
  • మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం
ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), యశస్వి జైస్వాల్ (101) అద్భుత శతకాలతో చెలరేగడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్రీజులో గిల్‌తో పాటు రిషభ్ పంత్ (65 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. అయితే, శనివారం (జూన్ 21) రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

రెండో రోజు ఆట సాఫీగా సాగుతుందా లేదా అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. యార్క్‌షైర్‌ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, ఉదయం ఆట ప్రారంభమయ్యే సమయంలో వర్షం పడే చాన్స్ (5% అవకాశం) తక్కువగా ఉన్నప్పటికీ, లంచ్ విరామం తర్వాత పరిస్థితి మారనుంది. మధ్యాహ్నం 2 గంటలకు 56% వర్షపు సూచన ఉండగా, సాయంత్రం 3 గంటల నుంచి ఉరుములతో కూడిన వర్షానికి (49% అవకాశం) యెల్లో వార్నింగ్ జారీ చేశారు. 

బీబీసీ కథనం ప్రకారం, జూన్ 20న ఉదయం 10:35 గంటలకు జారీ చేసిన హెచ్చరికలో, "శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇది ఆటపై ప్రభావం చూపొచ్చు" అని పేర్కొంది. ఈ హెచ్చరిక సాయంత్రం 3 గంటల నుంచి అర్ధరాత్రి దాటి 4 గంటల వరకు వర్తిస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలున్నాయి, ఆ తర్వాత రాత్రి 8 గంటల నుంచి మళ్లీ వర్షం పుంజుకోవచ్చని తెలుస్తోంది. దీంతో, తొలి రోజు సంపాదించిన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్న భారత జట్టు ఆశలకు వరుణుడు అడ్డుపడతాడేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Shubman Gill
India vs England
India
England
Test Match
Cricket
Yashasvi Jaiswal
Rishabh Pant
Headingley
Weather Forecast

More Telugu News