Warangal Court: హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు

Warangal Court Receives Bomb Threat
  • హన్మకొండ, వరంగల్ జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు
  • డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన దుండగుడు
  • బాంబు స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు
హన్మకొండ, వరంగల్ జిల్లా న్యాయస్థానాలకు శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు నేరుగా డయల్ 100కు ఫోన్ చేసి కోర్టు ప్రాంగణాల్లో బాంబులు అమర్చినట్లు చెప్పడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కోర్టు సిబ్బంది ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు.

వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి జిల్లా కోర్టుల ప్రాంగణాలకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో కోర్టు కార్యకలాపాలకు కొంతసేపు అంతరాయం కలిగింది. న్యాయవాదులు, కోర్టు పనుల నిమిత్తం వచ్చిన వారు, కోర్టు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Warangal Court
Hanamkonda court
bomb threat
Warangal district
court bomb threat
police investigation
bomb squad
Telangana courts

More Telugu News