Shashi Tharoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విందు... శశి థరూర్ విమర్శలు

Shashi Tharoor Criticizes US Dinner for Pakistan Army Chief
  • పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌కు ట్రంప్ విందు ఇవ్వడంపై శశిథరూర్ తీవ్ర విమర్శ
  • ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమిచ్చిన వైనం అమెరికా మరువరాదని హితవు
  • ఉగ్రవాదులకు మద్దతివ్వొద్దని పాక్‌ను ట్రంప్ హెచ్చరించి ఉంటారని ఆకాంక్ష
  • కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కొందరితో భిన్నాభిప్రాయాలున్నాయని థరూర్ అంగీకారం
  • ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీతో చర్చించానన్న థరూర్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందన్న విషయాన్ని అమెరికా ఎన్నటికీ మరచిపోకూడదని ఆయన హితవు పలికారు.

ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ, "వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి ప్రధాన సూత్రధారి అయిన ఒసామా బిన్ లాడెన్ ఉదంతాన్ని పాకిస్థాన్ బృందాన్ని కలిసిన కొందరు అమెరికన్ చట్టసభ సభ్యులు విస్మరించినప్పటికీ, అమెరికా ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. లాడెన్‌ను కనుగొనేంత వరకు, ఒక ఆర్మీ క్యాంపు సమీపంలో పాకిస్థాన్ అతడిని దాచిపెట్టిన వ్యవహారాన్ని అమెరికన్లు అంత త్వరగా విస్మరించరు" అని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సహాయం అందించడం వంటి చర్యలకు పాల్పడకూడదని ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించి ఉంటారని తాను ఆశిస్తున్నట్లు థరూర్ పేర్కొన్నారు.
Shashi Tharoor
Pakistan Army Chief
Asim Munir
Donald Trump
Osama Bin Laden
Al Qaeda
Terrorism
US Pakistan Relations

More Telugu News