Narendra Modi: ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించిన సైప్రస్ ప్రజాప్రతినిధి... వీడియో ఇదిగో!

Narendra Modi Cyprus Representative Greets PM Modi by Touching His Feet
  • సైప్రస్‌లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం
  • మోదీ పాదాలకు నమస్కరించి గౌరవం చాటిన నికోసియా కౌన్సిల్ సభ్యురాలు
  • భారతీయ సంస్కృతిపై ఆమె అవగాహనను అభినందించిన ప్రధాని
ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఒక అనూహ్యమైన భారతీయ తరహా స్వాగతం లభించింది. నికోసియా నగర కౌన్సిల్ సభ్యురాలు మైకేలా కిథ్రియోటి మ్లాపా, చారిత్రక నికోసియా కేంద్రంలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ, గౌరవ సూచకంగా ఆయన పాదాలకు నమస్కరించారు. ఈ సంఘటన నిన్న (జూన్ 15) చోటుచేసుకుంది. భారతీయ సంస్కృతి పట్ల ఆమెకున్న అవగాహనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన కథనాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "ఇది ఎంతో కదిలించే ఘట్టం. వినయం, గౌరవం వంటి భారతదేశపు శాశ్వత విలువలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో ఈ హృద్యమైన ఘటన ప్రతిబింబిస్తోంది. ప్రధాని మోదీ చూపిన ఆదరణ, భారతదేశపు పెరుగుతున్న ప్రపంచ ప్రతిష్టను, సాంస్కృతిక ప్రభావాన్ని గౌరవంగా, ఆప్యాయంగా చాటుతోంది" అని పేర్కొన్నారు. నికోసియాలోని చారిత్రక కేంద్రంలో కౌన్సిల్ సభ్యురాలు మైకేలా కిథ్రియోటి మ్లాపా, ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించడం విదేశీయులు భారతీయతకు ఇచ్చే గౌరవానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Narendra Modi
Cyprus
India
Nicosia
Myrto Kountouris
Prahlad Joshi
Indian Culture
Viral Video
International Relations
Diplomacy

More Telugu News