Floods: భారీ వృక్షాన్ని పెకలించుకుని తనతో పాటు తీసుకెళ్లిన వరద నీరు... వీడియో వైరల్!
- ఇంటర్నెట్లో సందడి చేస్తున్న వీడియో
- నీటి ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన చెట్టు
- మధ్యలో బ్రిడ్జి అడ్డొచ్చినా ఆగని వైనం
ప్రస్తుతం దేశంలో చాలా భాగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో అనేక చోట్ల విస్తారంగా వర్షపాతం నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు కూడా నెలకొన్నట్టు తెలుస్తోంది.
తాజాగా, ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. భారీ వర్షాలతో ఓ నది పొంగి పొర్లుతుండగా, అందులో ఓ భారీ వృక్షం కూడా కొట్టుకొచ్చింది. మధ్యలో ఓ పట్టణం వద్ద బ్రిడ్జి అడ్డొచ్చినా కూడా వరద నీరు ఆ చెట్టును తనతో పాటు తీసుకెళ్లింది. ఇది చూసిన నెటిజన్లు నీటి ప్రవాహానికి ఉన్న శక్తి పట్ల ఆశ్చర్యపోతున్నారు.