Tomato Farmer: టమాటా రైతును కోలుకోలేని దెబ్బ తీస్తున్న 'ఊజీ ఈగ'

Tomato Farmer Facing Huge Losses Due to Uzi Fly in Chittoor
  • చిత్తూరు జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు
  • ఈగ సోకడంతో పూర్తిగా దెబ్బతింటున్న టమాటా నాణ్యత
  • పంట కొనేందుకు వ్యాపారులు వెనుకడుగు
చిత్తూరు జిల్లా టమాటా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర దొరక్క అల్లాడుతుంటే, ఇప్పుడు 'ఊజీ ఈగ' రూపంలో మరో పెనుముప్పు వారిని చుట్టుముట్టింది. ఈ ఈగ దాడి వల్ల టమాటా నాణ్యత దారుణంగా పడిపోవడంతో, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులు కూడా ముందుకు రాకపోవడంతో, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

వివరాల్లోకి వెళితే, ప్రస్తుత సీజన్‌లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున టమాటా పంటను సాగు చేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలోనే వచ్చింది. అయితే, 'ఊజీ ఈగ' ప్రభావంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈగ సోకిన కాయలు రూపు కోల్పోయి, త్వరగా కుళ్లిపోతున్నాయి. దీంతో మార్కెట్‌లో వాటికి ఏమాత్రం డిమాండ్ లేకుండా పోయింది. మంచి దిగుబడి కళ్లముందు ఉన్నప్పటికీ, అది చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

ధరల విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు, ఈ 'ఊజీ ఈగ' సమస్య మరింత భారంగా మారింది. మార్కెట్‌కు తీసుకెళ్లినా నాణ్యత లేని టమాటాలను కొనేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, రైతులు తమ పంటలో నాణ్యంగా ఉన్న కొద్దిపాటి కాయలను మాత్రమే ఏరివేసి అమ్ముకోవాల్సి వస్తోంది. మిగిలిన పంటను, ముఖ్యంగా 'ఊజీ ఈగ' సోకిన టమాటాలను ఏం చేయాలో తెలియక, రోడ్ల పక్కన, పొలాల గట్ల వెంబడి పారబోస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, రేయింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నాశనమవుతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ 'ఊజీ ఈగ' బెడద నుంచి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
Tomato Farmer
Chittoor district
tomato crop
Uzi fly
crop damage
tomato price
agricultural crisis
Andhra Pradesh farmers
crop loss
pest infestation

More Telugu News