Chandrababu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu to Review Yoga Event Preparations in Vizag
  • అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించనున్న సీఎం
  • ఉదయం 10:40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి రాక
  • కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ఆర్కే బీచ్‌లో తనిఖీ
  • నగరాభివృద్ధి, పర్యాటక ప్రగతికి ప్రభుత్వ ప్రాధాన్యత అని వెల్లడి
  • త్వరలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రత కట్టుదిట్టం
సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి ఉదయం 10:40 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బీచ్‌రోడ్డుకు వెళ్లి, యోగా వేడుక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన వేదిక‌ల వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తారు. ఆ త‌ర్వాత ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం నోవాటెల్ హోట‌ల్‌కి వెళ్లి అక్క‌డే అధికారుల‌తో స‌మీక్షిస్తారు.  

పీఎంపాలెంలోని వైజాగ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొని... యోగా వేడుక‌ల‌కు జ‌నం సమీక‌ర‌ణ విష‌యంలో చేప‌ట్టాల్సిన అంశాల‌పై నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం విజ‌య‌వాడకు తిరుగుప‌య‌నం అవుతారు. 

ఇక‌, సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఉన్న‌తాధికారులతో పాటు మంత్రులు పార్థ‌సార‌థి, డోలా శ్రీబాల‌వీరాంజ‌నేయ‌స్వామి ఆదివారం విశాఖ‌కు చేరుకున్నారు. 

విశాఖపట్నాన్ని ఆర్థిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఈ ఏడాది ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈనెల 17 నుంచి 21 వరకు నగరంలో తాత్కాలిక రెడ్ జోన్ ప్రకటించారు. దీంతో నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. 


Chandrababu
Visakhapatnam
Vizag
Andhra Pradesh
Yoga Day Celebrations
TDP
Palla Srinivasa Rao
PM Modi
Red Zone
Development Projects

More Telugu News