Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన కేంద్ర అధికారులు

Polavaram Project Works Inspected by Central Officials
  • డయాఫ్రంవాల్, బట్రన్ డ్యాంల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర జల సంఘం బృందం
  • కేంద్ర జలసంఘం బృందానికి సంబంధిత వివరాలు తెలియజేసిన ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు
  • గోదావరి వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు ప్రతిబంధకం ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామన్న ఇంజనీరింగ్ అధికారులు
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్. సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేశ్ కుమార్ బృందం తొలుత ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుని ప్రాజెక్టు నమూనాను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో సీపేజీ నివారణ కోసం నిర్మిస్తున్న బట్రస్ డ్యాం, డయాఫ్రం వాల్, గ్యాప్-1 నిర్మాణ పనులను, ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, స్పిల్ వే ప్రాంతాలను, కాంక్రీట్ మిక్సింగ్ ల్యాబ్ లను పరిశీలించింది.

కేంద్ర జల సంఘం బృందానికి సీఈ కె. నరసింహమూర్తి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్ సంబంధిత వివరాలను తెలిపారు. ఈ బృందం పలు విషయాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసి, పనులు జరుగుతున్న తీరు, తదితర విషయాలను అడిగి తెలుసుకుంది. ప్రస్తుతానికి నిర్మాణానికి ఆటంకం లేదని, భవిష్యత్తులో వరద వస్తే ఎలా అని సి.డబ్ల్యు.సి. బృందం సందేహం వ్యక్తం చేయగా, వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు ఎలాంటి ప్రతిబంధకం ఎదురు కాకుండా ఉండేలా 19 మీటర్ల ఎత్తులో వరదను తట్టుకునేలా చర్యలు తీసుకున్నామని, ఇది 20 నుంచి 22 మీటర్లకు చేరుకున్నా పనులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. జులై నుంచి గోదావరి వరద ప్రవాహం పెరిగినా అక్టోబర్ చివరి నాటికి తగ్గిపోతుందని ఇంజనీర్లు వివరించారు. 
Polavaram Project
Polavaram
Central Water Commission
Yogesh Paithankar
Buttress Dam
Diaphragm wall
Godavari River
AP Irrigation
Andhra Pradesh

More Telugu News