Air India Flight Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. తోక భాగంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహం గుర్తింపు

Air India Flight Crash Air Hostess Body Found in Tail Section
  • ఎయిర్‌హోస్టెస్ మృతదేహంగా నిర్ధారణ, కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా మృతదేహం గుర్తింపు
  • సీనియర్ పైలట్ ఐదు సెకన్ల ఆడియో వెలుగులోకి..!
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమానం తోక భాగంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస సముదాయంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానం చాలా వరకు మంటల్లో కాలిపోగా, తోక భాగం మాత్రం ఒక భవనంపై ఇరుక్కుపోయింది.

తోక భాగాన్ని తొలగిస్తుండగా లభ్యమైన మృతదేహం విమాన సిబ్బందిలోని ఎయిర్‌హోస్టెస్‌దిగా అధికారులు ధృవీకరించారు. 

పైలట్ చివరి మాటలు

ప్రమాదానికి ముందు విమానం సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ చివరి ఐదు సెకన్ల ఆడియో సందేశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన "మేడే.. మేడే.. మేడే.. నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌" (అపాయం.. అపాయం.. అపాయం.. శక్తి లేదు.. ఒత్తిడి లేదు.. కిందకు పడిపోతున్నాం) అని అత్యంత ఆందోళనకరంగా చెప్పినట్లు రికార్డయింది. ఈ సందేశం అందిన వెంటనే విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.
Air India Flight Crash
Air India
Sumit Sabhrawal
Ahmedabad
Flight crash
Air hostess

More Telugu News