Telangana Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana Government Employees Get Good News DA Hiked
  • 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
  • ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ
  • పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల కరవు భత్యాన్ని (డీఏ) 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన 3.64 శాతం డీఏతో ఉద్యోగుల మూల వేతనంపై అదనపు భత్యం కలవనుంది. 
Telangana Government Employees
Telangana government
government employees DA
DA hike
Telangana DA
dearness allowance
employee benefits
Telangana news
government jobs
salary hike

More Telugu News