Avika Gor: ప్రియుడితో యంగ్ హీరోయిన్ అవికా గోర్ నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో

Actress Avika Gor engaged to Milind Chandwani
  • ప్రియుడు మిలింద్ చాంద్వానీతో ఎంగేజ్‌మెంట్
  • సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన అవికా
  • అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
తెలుగు టీవీ ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా పరిచయమై... సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా దగ్గరైన యువనటి అవికా గోర్ తన జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టానికి అడుగులు వేశారు. తన ప్రియుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీని పెళ్లాడబోతున్నారు. మిలింద్ తో నిశ్చితార్థం జరిగినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా అవికా గోర్, మిలింద్ చాంద్వానీ ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. తమ ప్రేమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తూ, వీరిద్దరూ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అవికా గోర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. "ఇది నిజమైన శుభవార్తే" అంటూ ఓ పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు.

నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అవికా షేర్ చేశారు. ఒక ఫొటోలో మిలింద్ చేతిని పట్టుకుని ఆనందంగా నవ్వుతూ కనిపించగా, మరో ఫొటోలో మిలింద్ బుగ్గపై ముద్దుపెడుతూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు అవికా గోర్, మిలింద్ చాంద్వానీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే, పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
Avika Gor
Avika Gor marriage
Milind Chandwani
Avika Gor engagement
Chinnari Pellikuturu
Telugu Actress
Social Media Influencer
Avika Gor wedding plans
Indian Television Actress

More Telugu News