ఎయిరిండియా క్రాష్... ప్రమాదానికి ముందు 'మేడే కాల్' చేసిన పైలట్
- అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
- కుప్పకూలిన లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం
- మేడే కాల్ కు స్పందించని ఏటీసీ
ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి 'మేడే కాల్' జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే 'మేడే కాల్' అంటారు. అయితే, ఈ 'మేడే కాల్'కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ పేర్కొనడం గమనార్హం.