viral video: మీదికి దూసుకొచ్చిన లారీ.. కొద్దిలో తప్పించుకున్న బైకర్.. వీడియో ఇదిగో!

Lorry hits bike youth Escaped in Aswaraopeta
  • ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో లారీ బీభత్సం
  • నుజ్జునుజ్జుగా మారిన బైక్‌.. వెంట్రుకవాసిలో తప్పించుకున్న యువకుడు
  • సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ దృశ్యాలు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో నిన్న పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపైకి ఓ లారీ వేగంగా దూసుకురాగా, వాహనదారుడు రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లికి చెందిన బత్తుల కృష్ణ (30) వినాయకపురంలో నివాసం ఉంటూ జేసీబీని అద్దెకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న ఉదయం వినాయకపురం శివారులోని ఓ పెట్రోల్ బంకులో తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బైక్‌ను పక్కన ఆపి, ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

అదే సమయంలో భద్రాచలం వైపు సరుకులతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి కృష్ణపైకి దూసుకొచ్చింది. చివరి క్షణంలో గమనించిన కృష్ణ వెంటనే పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద దృశ్యాలు పెట్రోల్ బంకు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
viral video
lorry accident
Batthula Krishna
Khammam district
Aswaraopeta
Road accident
Bike accident
Andhra Pradesh
petrol bunk
NTR district

More Telugu News