Mahendra: శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన నిర్మాత మహేంద్ర మృతి

Producer Mahendra who introduced Srihari as hero passed away
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర
  • గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఈరోజు మధ్యాహ్నం గుంటూరులో మహేంద్ర అంత్యక్రియలు
  • ఏఏ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై 50కి పైగా చిత్రాల నిర్మాణం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా సుపరిచితులైన కె. మహేంద్ర (79) గత అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం గుంటూరులో జరగనున్నాయి.

1946లో జన్మించిన మహేంద్ర తొలుత ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా పలు చిత్రాలకు సేవలందించారు. అనంతరం దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందారు. తర్వాత నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఏఏ ఆర్ట్స్ పతాకాలపై దాదాపు 50కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చిన తర్వాత ఏఏ ఆర్ట్స్ బ్యానర్‌పై నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన ఘనత మహేంద్రకే దక్కుతుంది.

నిర్మాతగా ఆయన ప్రస్థానం 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ చిత్రంతో ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురులేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహత్మ్యం’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. 
Mahendra
Producer Mahendra
Telugu cinema
Srihari
AA Arts
Guntur
Telugu film industry
film producer
death
movie producer

More Telugu News