Savitha: ఓ అధికారి ఇచ్చిన బొకేను వెనక్కి విసిరేసిన మంత్రి సవిత... వీడియో వైరల్

Minister Savitha throws bouquet back at official video goes viral
  • బీసీ సంక్షేమ మంత్రి ఎస్. సవిత తీరుపై తీవ్ర చర్చ
  • శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఓ అధికారి ఇచ్చిన బొకే విసిరివేత
  • జూన్ 1న జరిగిన ఘటన, ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
  • నిత్యావసరాల పంపిణీ కార్యక్రమ సమీక్షలో ఈ ఘటన
  • జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే మంత్రి అసహనం! 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఓ అధికారిక కార్యక్రమంలో వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఆమె, ఓ అధికారి అందించిన పూల బొకేను కోపంగా వెనక్కి విసిరికొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి, దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ సంఘటన జూన్ 1వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని సీఎస్‌డీటీ (కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ)లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నిత్యావసర సరుకుల పంపిణీ, రేషన్ షాపుల పునఃప్రారంభంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అధికారి ఆమెకు స్వాగతం పలుకుతూ పూల బొకే అందించే ప్రయత్నం చేయగా, మంత్రి సవిత తీవ్ర అసహనంతో ఆ బొకేను వెనక్కి విసిరేయడం వీడియోలో కనిపించింది. ఆ బొకే అక్కడే ఉన్న మంత్రి గన్‌మన్‌కు తగిలి కిందపడిపోయినట్లు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా కలెక్టర్ చేతన్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సంఘటనకు దారి తీసిన కచ్చితమైన కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. జూన్ మొదటి తేదీన జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు కొన్ని రోజుల తర్వాత బయటకు రాగా, అవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

Savitha
Minister Savitha
AP Minister
Andhra Pradesh
Satyasai District
Flower bouquet
Viral video
Controversy
Government official

More Telugu News