పాకిస్థాన్, భారత్‌లను ఒకేలా చూస్తామంటే అంగీకరించేది లేదు!: జైశంకర్ కీలక వ్యాఖ్య
- పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్
- ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పిన వైనం
- చెడ్డవాళ్లను, బాధితులను ఒకేలా చూడలేమన్న మంత్రి
- బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో దిల్లీలో కీలక భేటీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉగ్రవాదాన్ని మేం ఏమాత్రం ఉపేక్షించం. ఈ విషయంలో భారత్ 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోంది. చెడు చేసేవారిని, ఆ చెడు వల్ల నష్టపోయిన బాధితులను ఒకేలా చూస్తామంటే మేం దాన్ని ఎప్పటికీ అంగీకరించం. ఈ విషయాన్ని మా భాగస్వామ్య దేశాలన్నీ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.
ఈ భేటీలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.