Hidma: ఆపరేషన్ కగార్ వేళ వెలుగులోకి హిడ్మా తాజా ఫొటో

Hidmas Latest Photo Surfaces Amid Operation Kagar
––
ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోయిస్టులపై విరుచుకుపడుతున్న వేళ మరో సంచలనం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేత, గొరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరున్న మావోయిస్టు హిడ్మా తాజా ఫొటో వెలుగులోకి వచ్చింది. కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మా దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తారని సమాచారం.
 
మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. వేలాది బలగాలు దండకారణ్యంలో కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అరెస్టు వార్త నిజమే అయినా పోలీసులకు దొరికింది హిడ్మా కాదని, ఆయన పేరున్న మరో మావోయిస్టు కుంజం హిడ్మా అని పోలీసులు తర్వాత వివరణ ఇచ్చారు. కుంజం హిడ్మా ఏరియా కమిటీ సభ్యుడు అని చెప్పారు.
 
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు సంబంధించిన ఫొటోలు పెద్దగా అందుబాటులో లేవు. 20 ఏళ్ల నాటి ఫొటో ఒకటి పోలీసుల వద్ద ఉంది. హిడ్మా వయసు ప్రస్తుతం 51 ఏళ్లు. తాజాగా హిడ్మా లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. దీంతో హిడ్మా ఎక్కడ ఉన్నారు. ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చింది అనే చర్చ మొదలైంది.
Hidma
Maoist Hidma
Operation Kagar
Sukma
Chhattisgarh
Dandakaranya
Naxal
Maoist Leader
Kunjam Hidma

More Telugu News