Sharmistha Panoly: శర్మిష్ఠ పనోలీకి ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కలకత్తా హైకోర్టు

Sharmistha Panoly Granted Interim Bail by Kolkata High Court
  • 'ఆపరేషన్ సిందూర్' పై వ్యాఖ్యలతో మే 31న శర్మిష్ఠ అరెస్ట్
  • అరెస్టుపై రాజకీయ దుమారం, డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ నుంచి మద్దతు
  • శర్మిష్ఠపై ఫిర్యాదు చేసిన వజహత్ ఖాన్ ఖాద్రీపైనే కోల్‌కతా పోలీసుల ఎఫ్ఐఆర్
ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీకి కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శర్మిష్ఠ అరెస్టుకు కారణమైన వజహత్ ఖాన్ ఖాద్రీ అనే వ్యక్తిపైనే కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే, పహల్గామ్ దాడి తర్వాత భారత సైనిక చర్యను ప్రశ్నిస్తూ వచ్చిన ఒక పోస్టుకు ప్రతిస్పందనగా శర్మిష్ఠ పనోలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు వారాలకు పైగా సమయం తర్వాత, మే 31న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. శర్మిష్ఠ పనోలీని గతవారం గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

శర్మిష్ఠ పనోలీ అరెస్ట్ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ వివాదం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు, రైట్-వింగ్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ నాయకుడు గీర్ట్ వైల్డర్స్ కూడా శర్మిష్ఠకు మద్దతు తెలిపారు. ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు "స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణకు అవమానం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను విడుదల చేసేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.


Sharmistha Panoly
Kolkata High Court
Interim Bail
Operation Sindoor
Religious tensions
Wajahat Khan Khadri
Mamata Banerjee
Geert Wilders
Social Media Influencer
West Bengal Politics

More Telugu News