Kishore: 'వడక్కన్' .. తెలుగు ఆడియన్స్ వెయిటింగ్!

Vadakkan Movie Update
  • మలయాళ సినిమాగా 'వడక్కన్'
  • ఆసక్తిని రేకెత్తించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 
  • ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • ఈ నెల 6వ తేదీ నుంచి ఆహా తమిళ్ లో
      
ఈ మధ్య కాలంలో ఒకే సినిమా వివిధ ఓటీటీ ట్రాకులపైకి వచ్చేస్తోంది. అలా ఒకటికి మించి ఓటీటీ సెంటర్లలో ఆయా సినిమాలను చూసే అవకాశం లభిస్తోంది. అదే దార్లో ఇప్పుడు మరో సినిమా ఇంకో ఓటీటీ సెంటర్ లోకి వచ్చింది. ఆ సినిమా పేరే 'వడక్కన్'. కిశోర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ మలయాళ సినిమాకి సాజిద్ దర్శకత్వం వహించాడు. 

మలయాళంలో 'వడక్కన్' సినిమా మార్చి 7వ తేదీన విడుదలైంది. మలయాళంలో రూపొందిన ఫస్టు పారానార్మల్ థ్రిల్లర్ గా ఈ సినిమాకి గట్టి ప్రచారం లభించింది. ఘోస్ట్ ఎలిమెంట్స్ తో కూడిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. దాంతో థియేటర్స్ వైపు నుంచి ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ దక్కింది. మే 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. 

అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇంగ్లిష్ .. కన్నడ .. మలయాళం భాషలలో అందుబాటులో ఉంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలో తెలుగులోను రానుందనే టాక్ వినిపిస్తోంది. ఓ టీవీ రియాలిటీలో వరుస హత్యలు జరుగుతాయి. ఆ మిస్టరీని ఛేదించడానికి కిశోర్ రంగంలోకి దిగుతాడు. ఆయనకు ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.


Kishore
Vadakkan
Vadakkan movie
Malayalam thriller
Aha Tamil
Amazon Prime
OTT release
Telugu dubbing
Paranormal thriller
Investigation thriller

More Telugu News