Mumbai Airport: పార్కింగ్ కోసం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫైటింగ్.. కుమ్మేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు.. వీడియో ఇదిగో!

Mumbai Airport Fight Erupts Between Security and Drivers Over Parking
  • క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బంది,  డ్రైవర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం
  • సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం
  • సీఐఎస్ఎఫ్ సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి
ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్‌కు సంబంధించిన ఓ చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు నిలిపే విషయంలో క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి, పలువురు ట్యాక్సీ డ్రైవర్లకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది కాస్తా ఘర్షణగా మారి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. 

ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ గొడవ కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే విమానాశ్రయానికి చేరుకున్నారు. గొడవకు గల కారణాలు, ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించి, తదుపరి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.  
Mumbai Airport
Mumbai airport fight
airport parking
taxi drivers
security staff
CISF
Mumbai airport clash
parking dispute
airport security

More Telugu News