Erragadda Mental Hospital: ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. ఒకరి మృతి

Erragadda Mental Hospital Food Poisoning One Dead
  • ఫుడ్ పాయిజన్ పై ఆరా తీసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ
  • ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు
  • ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అనుదీప్
ఎర్రగడ్డలోని మానసిక చికిత్సా కేంద్రంలో ఆహార కల్తీ కారణంగా 70 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కిరణ్ అనే మానసిక రోగి మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 67 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శింహ ఆరా తీశారు. రోగులకు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మంగళవారం రాత్రి మానసిక వైద్యశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 
Erragadda Mental Hospital
Hyderabad
Food Poisoning
Patient Death
Damodara Rajanarsimha
Osmania Hospital
Anudeep
Telangana Health Department

More Telugu News