IPL 2025 Eliminator: ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. వ‌ర్షం ప‌డితే ఆ జ‌ట్టు ఇంటికే!

What Happens If Gujarat Titans vs Mumbai Indians IPL 2025 Eliminator Gets Washed Out
  • ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా ఎలిమినేట‌ర్ మ్యాచ్
  • త‌ల‌ప‌డ‌నున్న గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబ‌యి ఇండియ‌న్స్ 
  • ఒక‌వేళ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైతే ముంబ‌యి ఇంటికే
  • లీగ్ దశ‌లో మూడో స్థానంలో ఉన్న గుజ‌రాత్ క్వాలిఫ‌య‌ర్‌-2కి అర్హ‌త‌
శుక్రవారం ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ), ముంబయి ఇండియన్స్ (ఎంఐ) తలపడ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. అక్కడ ఫైనల్‌కు చేరుకోవడానికి పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో తలపడుతుంది. 

వర్షం వ‌ల్ల మ్యాచ్ ర‌ద్దైతే జ‌రిగేది ఇదే!
ఒక‌వేళ ఈ మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దయితే, గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన గుజ‌రాత్ క్వాలిఫైయర్-2కి అర్హ‌త సాధిస్తుంది. ముంబ‌యి ఇంటిముఖం ప‌డుతుంది. ఇక‌, ఎలిమినేట‌ర్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు.  

ఈరోజు ముల్లాన్‌పూర్‌లో వాతావ‌ర‌ణం ఇలా
వాతావరణ శాఖ నివేదిక‌ ప్రకారం, మ్యాచ్ సమయంలో ముల్లాన్‌పూర్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువ. ఉష్ణోగ్రత గ‌రిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్‌, క‌నిష్ఠంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఫలితంగా శుక్రవారం ఆట ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగానే జరిగే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే... గురువారం ఇదే వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. పీబీకేఎస్‌ను ఆర్‌సీబీ ఏకంగా 8 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. మొద‌ట బౌలింగ్‌లో విజృంభించిన ర‌జ‌త్ ప‌టిదార్ సార‌థ్యంలోని బెంగ‌ళూరు, ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లోనూ అద‌ర‌గొట్టింది. మొత్తంగా ఆల్‌రౌండ‌ర్ షోతో ఫైన‌ల్ కు చేరింది.  
IPL 2025 Eliminator
Gujarat Titans
Gujarat Titans vs Mumbai Indians
GT vs MI
Mullanpur Weather
Punjab Kings
Royal Challengers Bangalore
IPL Playoff Rain Rules
IPL Points Table
Cricket

More Telugu News