Fee Reimbursement: తెలంగాణ‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై కీల‌క నిర్ణ‌యం

Key Decisions on Fee Reimbursement in Telangana
  • డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ క‌ట్‌
  • ఏడు సంప్ర‌దాయ యూనివ‌ర్సిటీల వీసీల స‌మావేశంలో నిర్ణ‌యం
  • దీంతో కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంద‌ని వీసీల అభిప్రాయం
తెలంగాణ‌లో డిగ్రీలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై విశ్వవిద్యాల‌యాల‌ ఉప‌కుల‌ప‌తుల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుంటే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పొందేందుకు అర్హ‌త ఉండ‌ద‌ని ఉప‌కుల‌ప‌తుల భేటీలో నిర్ణ‌యించారు. 

రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌యంలో ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏడు సంప్ర‌దాయ యూనివ‌ర్సిటీల వీసీల స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో డిగ్రీలో క‌నీసం 75 శాతం హాజ‌రు లేకుండా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు అర్హ‌త లేద‌ని గ‌తంలోనే ప్ర‌భుత్వ ఆదేశాలు ఉన్నాయ‌న్నారు. కానీ, అవి అమ‌లు కావ‌డం లేద‌ని ఉప‌కుల‌ప‌తులు ప్ర‌స్తావించారు. 

ఈసారి త‌ప్ప‌కుండా హాజ‌రును ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు ముడిపెట్టి ఆ ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో కొంత‌మేర విద్యానాణ్య‌త పెరుగుతుంద‌ని వీసీలు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండ‌గా వాటిని 142కు కుదించాల‌ని నిర్ణ‌యించారు. 
Fee Reimbursement
Telangana Fee Reimbursement
Telangana
Higher Education
University
Attendance
Balkishta Reddy
Degree Courses
Education Policy

More Telugu News