Gaddar Film Awards: తెలంగాణ ప్ర‌భుత్వానికి వైజ‌యంతి మూవీస్‌, పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థ‌లు థ్యాంక్స్

Telangana Government Thanks to Vyjayanthi Movies Pink Elephant for Gaddar Awards
  • దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత గ‌ద్ద‌ర్‌ అవార్డుల‌ ప్ర‌క‌ట‌న‌
  • అవార్డులు కొల్ల‌గొట్టిన‌ ప‌లు చిత్రాలు
  • తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆయా చిత్రాల నిర్మాణ సంస్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ పోస్టులు
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఈరోజు గద్దర్ అవార్డులను ప్ర‌క‌టించింది. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప‌లు చిత్రాలు అవార్డులు కొల్ల‌గొట్టాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆయా చిత్రాల నిర్మాణ సంస్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. 

ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో వ‌చ్చిన 'క‌ల్కి 2898 ఏడీ' గ‌ద్ద‌ర్ అవార్డుల‌లో ఉత్త‌మ చిత్రంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్ స్పందించింది. తెలంగాణ‌ ప్ర‌భుత్వానికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. చిత్ర బృందాన్ని ప్రోత్స‌హించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది. 

అలాగే 'క‌మిటీ కుర్రాళ్లు' చిత్రానికి గాను డైరెక్ట‌ర్‌ య‌ధువంశీకి ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడు అవార్డు ద‌క్కింది. త‌మ చిత్ర ద‌ర్శ‌కుడికి అవార్డు ఇచ్చినందుకు నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్ తెలంగాణ స‌ర్కార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. " 'క‌మిటీ కుర్రాళ్లు' టీమ్‌కు ఇదోక మైలురాయి. తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి ధ‌న్య‌వాదాలు. మా శ్ర‌మ‌ను గుర్తించినందుకు గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఈ గుర్తింపు మా గౌర‌వాన్ని మ‌రింత పెంచింది" అని పోస్ట్ చేసింది. 

ఇక‌, 'ఆయ్' సినిమా ఉత్త‌మ ప్ర‌జాదర‌ణ పొందిన మూవీగా నిలిచింది. దీంతో చిత్రం యూనిట్ తెలంగాన ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని తెలిపింది. 

నాలుగు అవార్డులు కొల్ల‌గొట్టిన ల‌క్కీ భాస్క‌ర్‌
ఇవాళ ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డుల్లో దుల్క‌ర్ స‌ల్మాన్‌, వెంకీ అట్లూరి కాంబోలో వ‌చ్చిన‌ 'ల‌క్కీ భాస్క‌ర్' ప్రభంజ‌నం సృష్టించింది. ఏకంగా నాలుగు అవార్డులు (ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ స్క్రీన్‌ప్లే, ఉత్త‌మ ఎడిట‌ర్‌) కొల్ల‌గొట్టింది. ఇది టీమ్‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. ఈ మూవీని ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.     


Gaddar Film Awards
Telangana Government
Kalki 2898 AD
Vyjayanthi Movies
Committee Kurrallu
Pink Elephant Pictures
Lucky Bhaskar
Dulquer Salmaan
Telugu Cinema
Revanth Reddy

More Telugu News