Devayani: ఓటీటీలో తమిళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!

Nizharkudai Movie Updte
  • తమిళంలో రూపొందిన 'నిజార్ కుడై'
  • దేవయాని ప్రధానమైన పాత్రను పోషించిన కంటెంట్  
  • ఈ నెల 9న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 30 నుంచి ఆహా తమిళ్ లో    
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఆ జోనర్లో దేవయాని చేసిన సినిమానే 'నిజార్ కుడై'. శివ ఆర్ముగం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. విజిత్ .. కన్మణి మనోహర్ .. రాజ్ కపూర్ .. ఇళవరసు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.  

థియటర్లో విడుదలైన 20 రోజులలోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తోంది. ఈ నెల 30వ తేదీ నుంచి 'ఆహా తమిళ్ 'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకి నరేన్ బాలకుమార్ సంగీతాన్ని అందించాడు. దేవయాని నటన వైపు నుంచి ఈ సినిమా మంచి మార్కులను తెచ్చుకుంది. 

కథ విషయానికి వస్తే .. నిరంజన్ - లాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారి సంతానమే నీలా. చిన్నప్పటి నుంచి పాపకి ఆరోగ్య సమస్య ఉంటుంది. అందువలన జ్యోతి అనే కేర్ టేకర్ ను మాట్లాడుకుంటారు. అయితే ఓ రోజున హఠాత్తుగా పాప కనిపించకుండా పోతుంది. పాపకు ఏమౌతుంది? అందుకు కారకులు ఎవరు? నిరంజన్ దంపతులు ఏం చేస్తారు? అనేది కథ. 


Devayani
Nizhal Kudai
Nizhal Kudai movie
Tamil thriller movie
Aha Tamil
OTT release
Investigation thriller
Tamil cinema
Vijith
Kanmani Manohar

More Telugu News