NTR: ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి

PM Modi Pays Tribute to NTR
  • గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్ ను కొనియాడిన మోదీ
  • ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు వెల్లడి
  • నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న ప్రధాని
నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
NTR
Narendra Modi
NTR Jayanthi
Telugu cinema
Andhra Pradesh
Telugu actor
Telugu Desam Party
Political leader
Tribute
Coalition government

More Telugu News