Viva Harsha: బీఎండబ్ల్యూ లగ్జరీ కారు కొనుగోలు చేసిన వైవా హర్ష

Viva Harsha buys BMW luxury car
  • కమెడియన్ గా రాణిస్తున్న వైవా హర్ష
  • కారు కొన్న విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
  • కారు ధర రూ.1.30 కోట్లు ఉంటుందని అంచనా!
'వైవా' అనే షార్ట్ ఫిల్మ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఆ తర్వాత కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు తాజాగా ఓ ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. వాహనాలంటే ఎంతో ఇష్టపడే హర్ష, ఇప్పుడు తన గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ సిరీస్‌కు చెందిన ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ మోడల్ కారును చేర్చాడు. ఈ విషయాన్ని హర్ష స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

హర్ష కొనుగోలు చేసిన ఈ బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో సుమారు రూ. కోటి 30 లక్షల నుంచి రూ. కోటి 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. హర్షకు మొదటి నుంచి కార్లు, స్పోర్ట్స్ బైక్‌లంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. వీలు దొరికినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంటాడని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఇప్పుడు ఈ కొత్త కారు కొనుగోలుతో అతడికి వాహనాలపై ఉన్న మక్కువ మరోసారి స్పష్టమైంది.

సినిమాల విషయానికొస్తే, 'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో వచ్చిన పాపులారిటీతో హర్ష వరుసగా సినిమా అవకాశాలు అందుకున్నారు. కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నవ్వించిన ఆయన, గతేడాది 'సుందరం మాస్టర్' అనే సినిమాలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
Viva Harsha
Harsha Chemudu
BMW F87 M2 Competition
luxury car
Telugu comedian
Sundaram Master movie
Mogali movie
Bakasura Restaurant movie
Hyderabad car price
Telugu cinema

More Telugu News