Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు

Vallabhaneni Vamsi Health Bulletin Released by Doctors
  • గుంటూరు జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు
  • వంశీకి ఫిట్స్, నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్య ఉన్నట్టు నిర్ధారణ
  • స్లీప్ టెస్ట్ కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేశామన్న జీజీహెచ్ సూపరింటెండెంట్
నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న గన్నవరం మాజీ శాసనసభ్యులు, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోమారు క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించి, చికిత్స చేయించారు.

జీజీహెచ్‌లోని న్యూరాలజీ విభాగం వైద్యులు వంశీకి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో, వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. 

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ తాజాగా ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. "వంశీకి ఫిట్స్ ఉన్నాయి. అలాగే, నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస ఆగిపోతోంది" అని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్ టెస్ట్ చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ కారణంగా, ఆయన్ను స్లీప్ టెస్ట్ చేయించుకోవడానికి వేరొక ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పూర్తి కావడంతో వంశీని తిరిగి విజయవాడ జైలుకు తరలించారు.
Vallabhaneni Vamsi
Gannavaram
YSRCP
Guntur GGH
Health Bulletin
Sleep Apnea
Seizures
Fake Documents Case

More Telugu News