Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముగిసిన వైద్య చికిత్స... జైలుకు తరలింపు

YSRCP Leader Vallabhaneni Vamsi Back to Jail After Treatment
  • పోలీసు కస్టడీలో అస్వస్థతకు గురైన వంశీ
  • గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స
  • చికిత్స ముగిసిన వెంటనే జైలుకు తరలింపు  
అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేత వల్లభనేని వంశీకి గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించారు. నకిళీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ కేసులో ఆయన పోలీసుల కస్టడీలో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను నిన్న కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఈరోజు గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పూర్తి కావడంతో ఆయనను విజయవాడలో జైలుకు తరలించారు.
Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi health
Guntur GGH
Fake house pattas case
Vijayawada jail
వైసీపీ
YSRCP
Andhra Pradesh politics
Kankipadu hospital

More Telugu News