గుంటూరు జీజీహెచ్ లో వల్లభనేని వంశీకి చికిత్స
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత
- చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
- నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా వంశీ
వంశీని జీజీహెచ్‌కు తీసుకువచ్చిన సందర్భంగా పోలీసులు ఆసుపత్రి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో సాధారణ రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రికి వచ్చే వారిని రైల్వేస్టేషన్ వైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో, ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు అంత దూరం తిరిగి రావడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసుల హడావుడి, ఆంక్షల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి చికిత్స అందించే క్రమంలో మిగిలిన వారికి అసౌకర్యం కలిగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.