Ram Chander Jangra: పహల్గామ్ బాధితులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

BJP MP Ram Chander Jangra Controversial Remarks on Pahalgam Victims
  • మీ భర్తల ప్రాణాల కోసం పోరాడాల్సిందన్న ఎంపీ
  • వేడుకునే బదులు ఉగ్రవాదులతో ఫైట్ చేయాల్సిందని వ్యాఖ్య
  • ఇటీవల కల్నల్ సోఫియాపై మధ్యప్రదేశ్ ఎంపీ వ్యాఖ్యలపై దుమారం
పహల్గామ్ బాధిత మహిళలపై మరో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను వేడుకునే బదులు మీ భర్తల ప్రాణాలు కాపాడుకోవడానికి వారితో పోరాడాల్సిందని అన్నారు. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. భివానీలో జరిగిన అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రామ్ చందర్ జాంగ్రా మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి గుర్తుచేశారు.

తమ భర్తలను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డా ఉగ్రవాదులు కనికరం చూపలేదంటూ బాధిత మహిళలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తమ భర్తల ప్రాణాలను కాపాడుకోవడానికి ఉగ్రవాదులతో పోరాడాల్సిందని అన్నారు. బాధిత మహిళలకు పోరాట స్ఫూర్తి లేదని విమర్శించారు. ఒకవేళ బాధిత మహిళలు అప్పుడు ఫైట్ చేసి ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని చెప్పారు. రాణి అహల్యాబాయి ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని మన సోదరీమణుల్లో తిరిగి రగిలించాలని ఎంపీ జాంగ్రా పేర్కొన్నారు.

ఎంపీ జాంగ్రా వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మన సైనికులను, మహిళలను అవమానించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారుతోందని విమర్శిస్తున్నారు. కాగా, ఇటీవల కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
Ram Chander Jangra
Pahalgam
Jammu Kashmir Terrorist Attack
BJP MP
Ram Chander Jangra Controversy
Bhiwani
Ahilyabai Holkar Jayanti
Terrorism
Kashmir attack victims
Kunwar Vijay Shah

More Telugu News