దేశ రహస్యాలు పాక్‌కు: గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!
- పాకిస్థాన్‌కు గూఢచర్యం: గుజరాత్‌లో సహదేవ్ అనే వ్యక్తి అరెస్ట్
- ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ దేశ రహస్యాలు లీక్
- ఐఏఎఫ్, బీఎస్ఎఫ్ కీలక సమాచారాన్ని వాట్సప్‌లో చేరవేత
- సమాచారం పంపినందుకు రూ.40 వేలు అందుకున్న నిందితుడు
సహదేవ్‌కు 2023లో వాట్సప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే పేరుతో ఒక యువతి పరిచయమైందని ఏటీఎస్ అధికారి సిద్ధార్థ్ మీడియాకు వివరించారు. అప్పటినుంచి ఆమెతో నిందితుడు టచ్‌లో ఉన్నాడని, భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చేపడుతున్న నూతన నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను, నిర్మాణంలో ఉన్న ప్రదేశాల దృశ్యాలను ఆమెకు పంపినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మే ఒకటవ తేదీన సహదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
నిందితుడు సహదేవ్ నుంచి సమాచారం సేకరించిన ఫోన్ నంబర్లు పాకిస్థాన్‌లో చలామణిలో ఉన్నాయని ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఈ సమాచారం చేరవేసినందుకు గాను, గుర్తుతెలియని వ్యక్తి ద్వారా నిందితుడికి రూ.40 వేలు అందినట్లు కూడా గుర్తించామన్నారు.