Kajal Aggarwal: కొడుకుతో కలిసి కాజల్ సమ్మర్ ట్రిప్.. వీడియో ఇదిగో!

Kajal Aggarwal Spotted at Mumbai Airport with Son
--
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. తాజాగా కాజల్ తన కొడుకుతో కలిసి ముంబై విమానాశ్రయంలో మీడియా కంటపడింది. కొడుకుతో కలిసి కాజల్ సమ్మర్ ట్రిప్ కు వెళుతున్నట్లు సమాచారం. విమానాశ్రయంలో కారు దిగుతూ కాజల్ కనిపించగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది.

వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ తో కాజల్ మెరిసిపోయింది. పక్కనే బ్లాక్ టీషర్ట్, ఎరుపు రంగు ట్రౌజర్ తో కాజల్ కొడుకు ముద్దుగా కనిపించాడు. ఇద్దరూ కలిసి విమానాశ్రయం లోపలికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అభిమానులు స్పందిస్తూ.. కాజల్ అగర్వాల్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు పుట్టినా కాజల్ అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు.
Kajal Aggarwal
Kajal Aggarwal son
Summer trip
Mumbai airport
Tollywood actress
Viral video
Celebrity news
Kajal Aggarwal family

More Telugu News