Vamshi: నన్ను కలవడానికి ఎవరినీ రానీయను: డైరెక్టర్ వంశీ!

Director Vamsi Interview
  • నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు 
  • సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఉంటాను 
  • ఎవరితో ఎక్కువగా మాట్లాడటం ఉండదు 
  • ఆ పాటను అడవిలో కాదు మామిడితోటలో తీశామన్న వంశీ  

ఒకప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు వంశీ. ఆ సినిమాలను ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూసేవాళ్లున్నారు. ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడేవాళ్లు ఉన్నారు. అలాంటి వంశీ తాజాగా 'జర్నలిస్ట్ ప్రేమ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " మా ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ సినిమాను గురించి మాత్రమే ఆలోచన చేస్తాను" అని చెప్పారు. 

" నన్ను కలవడానికి ఎవరైనా వస్తానని అంటే రావొద్దనే చెబుతాను. ఎందుకంటే టైమ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను సినిమాలకు సంబంధించిన పనుల్లో ఎప్పుడూ బిజీగానే ఉంటాను. రైటింగ్ .. ఎడిటింగ్ .. మ్యూజిక్ .. ఫొటోగ్రఫీకి సంబంధించిన పనులు నడుస్తూనే ఉంటాయి. నాకు ఇష్టమైన పనినే నేను చేస్తూ ఉంటాను గనుక, నాకు బోర్ కొట్టడం అంటూ ఏమీ ఉండదు. ప్రతిదీ నా అభిరుచికి తగినట్టుగా డిజైన్ చేసుకోవడం నాకు అలవాటు" అని అన్నారు. 

"నేను చేసిన సినిమాలలో 'అన్వేషణ' అంటే కూడా నాకు ఇష్టమే. ఇళయరాజా గారు ఒక కన్నడ సినిమా కోసం చేసిన ట్యూన్ ను ఆ సినిమావాళ్లు రిజక్ట్ చేశారు. ఆ ట్యూన్ ను 'అన్వేషణ' కోసం తీసుకున్నాను. 'ఇలలో కలిసే శిధిలాకాశమో' అనే ఆ పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను 'తలకోన' ఫారెస్టులో షూట్ చేశాము. అయితే ఈ పాట కోసం మళ్లీ అక్కడికి వెళితే ఖర్చు అవుతుందని, చెన్నై శివారులోని ఓ మామిడి తోటలో చేశాము" అని అన్నారు. 

Vamshi
Director Vamshi
Telugu cinema
Anveshana movie
Ilayaraja
Journalist Prema interview
Tollywood
Movie director
Telugu movies
Cinema writing

More Telugu News