కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు
- బాలీవుడ్ నటి నికితా దత్తాకు కరోనా నిర్ధారణ
- గతంలోనూ కొవిడ్ బారినపడి కోలుకున్న నికిత
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో, ప్రముఖ బాలీవుడ్ నటి నికితా దత్తా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నికితా దత్తాతో పాటు ఆమె తల్లికి కూడా ఈ వైరస్ సోకింది.
ఈ సందర్భంగా నికితా దత్తా తన పోస్ట్‌లో, "కొవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ పిలవని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్లీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి," అని పేర్కొన్నారు. గతంలో కూడా నికితా దత్తా ఒకసారి కొవిడ్ బారిన పడి, చికిత్స అనంతరం కోలుకున్న విషయం గమనార్హం.