SKN Producer: థియేటర్లలో తినుబండారాల ధరలపై నిర్మాత ఎస్కేఎన్ కామెంట్స్

SKN Producer Comments on Theater Food Prices
  • సినీ ఇండస్ట్రీ సమస్యలపై నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు
  • చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉందంటూ హాట్ కామెంట్స్ 
  • ప్రధాన సమస్యలపై సినీ పెద్దలు దృష్టి పెట్టాలన్న ఎస్కేఎన్
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ వేడుకలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉందని, యాంటీ బయోటిక్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. సినిమా పర్సంటేజీ విధానం కంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చూడాలన్నారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్లలో లభించే తినుబండారాల ధరలు కూడా అధికంగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని, సినీ పెద్దలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు.

ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన అన్నారు. ఉదయం ఆటకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారని, సాయంత్రం షోలకు, వారాంతాల్లో మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ఆయన అన్నారు. సాధారణ రోజుల్లో టికెట్ ధరలు తగ్గించి, వారాంతాల్లో ధరలు పెంచడం వంటి విధానాలపై ఆలోచన చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్సంటేజీలు పెంచుకుంటూ వెళితే సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఎస్కేఎన్ అభిప్రాయపడ్డారు. 
SKN Producer
Telugu Film Industry
Movie Theaters
Theater Food Prices
Ticket Prices
OTT Impact
Exhibitors
Telugu Film Chamber
Ghatikachalam Movie
Movie Industry Issues

More Telugu News