Nadendla Manohar: సమష్టిగా పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Joint Efforts with Telangana on Civil Supplies
  • హైదరాబాదులో ఏపీ, తెలంగాణ పౌర సరఫరాల  శాఖ మంత్రుల సమావేశం
  • హాజరైన నాదెండ్ల మనోహర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ (APSCSCL) భవనంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చలు జరిగాయి.

విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనం APSCSCL కు కేటాయించబడింది. ప్రస్తుతం ఈ భవనంలోని 2వ, 3వ, 4వ, 5వ అంతస్తులను తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ (TGSCSCL) అద్దెకు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించగా, ఈ అద్దె ఒప్పందంపై ఇరుపార్టీల మధ్య ఇవాళ MOUపై సంతకాలు జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతాంగాన్ని కాపాడుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం కింద ఒక కోటి పది లక్షల లబ్ధిదారులకు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సివిల్ సప్లై అనుసంధానంతో ఈ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. ఎగుమతుల ప్రోత్సాహంతో రైతులకు నష్టం లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

సమావేశంలో చర్చించిన విషయాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం... ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లి మార్పు తీసుకొస్తాం అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో పౌర సరఫరాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Nadendla Manohar
Andhra Pradesh
Telangana
Civil Supplies
Uttam Kumar Reddy
APSCSCL
TGSCSCL
Erragadda
Farmers Welfare
AP Civil Supplies

More Telugu News