1971 నాటి యుద్ధానికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పహల్గామ్ ఘటనపై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని
- పహల్గామ్ దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసంబద్ధ వ్యాఖ్యలు
- ఆపరేషన్ సిందూర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం
- పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తునకు సిద్ధమన్న షరీఫ్
- భారత్ దర్యాప్తు ప్రతిపాదనను తిరస్కరించిందని ఆరోపణ
- ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చేవని వ్యాఖ్య
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో ముజఫరాబాద్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులను షెహబాజ్ షరీఫ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ "పహల్గామ్ ఘటన చాలా దురదృష్టకరం. ఆ సమయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైనా తీవ్ర రూపు దాల్చే పరిస్థితులు నెలకొన్నాయి" అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని తాము కోరినప్పటికీ, భారత్ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని షరీఫ్ ఆరోపించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.