Chandrababu Naidu: గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం నా భాగ్యంగా భావిస్తున్నాను: సీఎం చంద్రబాబు
- కుప్పంలో సతీసమేతంగా చంద్రబాబు పర్యటన
- ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ
- టీటీడీ తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు అందించిన ముఖ్యమంత్రి
- గంగమ్మ జాతర చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనంలో పాల్గొన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఇవాళ కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ఈ పట్టువస్త్రాలు అందించడం తన భాగ్యంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
"కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. గంగమ్మ జాతర మహోత్సవంలో చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనం చేసుకుని, రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నాను. కుప్పం ప్రాంతంలో భక్తులు అమితంగా పూజించే తల్లి దయతో ఇక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తై... ఆ ఫలాలు ప్రజలకు దక్కాలని ప్రార్థించాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యేలా చూడమని ప్రార్థించాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.