Maoists: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్... 28 మంది మావోయిస్టుల హతం
- నారాయణపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్
- మావో అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు సమాచారం
- ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
ఛత్తీస్ గఢ్ అడవులు మరోసారి తుపాకుల గర్జనతో దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు సమాచారం. మరికొందరు మావోలు గాయపడినట్టు సమాచారం.
మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.