Kailash Mansarovar Yatra: మార్గమధ్యలో చిక్కుకుపోయిన కైలస మానస సరోవర్ యాత్రికులు

Kailash Mansarovar Yatra Pilgrims Stranded En Route
  • ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
  • సహాయక చర్యలు చేపట్టిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
  • ఐదేళ్ల తర్వాత ఇటీవల మొదలైన యాత్ర
కైలాస మానస సరోవర్ యాత్రీకులు మార్గమధ్యలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయిందని, యాత్రీకులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. దాదాపు 180 మంది యాత్రీకులు చిక్కుకుపోయారని చెప్పారు. అయితే, ఈ ఘటనలో యాత్రీకులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సమాచారం అందుకున్న బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై పడిపోయిన శిథిలాలను తొలగిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2020లో కరోనా  మహమ్మారి కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ యాత్రను పునరుద్ధరించలేదు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా మానస సరోవర్ యాత్రను ఐదేళ్ల తర్వాత ఈ ఏడాదే తిరిగి ప్రారంభించారు.
Kailash Mansarovar Yatra
Mansarovar
Kailash
Pithoragarh
Uttarakhand
Border Roads Organisation
India China relations
Landslide
Pilgrims

More Telugu News