Elon Musk: రిపబ్లికన్ నేతలకు షాక్ ఇచ్చేలా ఎలాన్ మస్క్ కీలక ప్రకటన .. అది ఏమిటంటే ..?

Elon Musk Announces Reduced Political Spending Shocks Republicans
  • భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు పెడతానని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్
  • ట్రంప్ మద్దతుదారుల ఆశలపై నీళ్లు చల్లిన మస్క్ వ్యాఖ్యలు 
  • రాజకీయ ప్రచారాలకు ఇప్పటికే చాలా ఖర్చు చేశానన్న మస్క్
రిపబ్లికన్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చేలా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ కోసం దాదాపు 250 మిలియన్ డాలర్లు ఎలాన్ మస్క్ ఖర్చు చేసిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌నకు ఆర్ధికంగా కీలక మద్దతుదారుడిగా ఉన్న మస్క్.. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు ఇక తక్కువగా ఖర్చు పెడతానని పేర్కొన్నారు.

ఖతార్‌లో జరిగిన ఓ ఆర్ధిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మస్క్ మాట్లాడుతూ రాజకీయ ప్రచారాల కోసం ఇదివరకే చాలా ఖర్చు పెట్టానని, ఇకపై తక్కువగా ఖర్చు పెడతానని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్న వేళ మస్క్ ఈ విధమైన ప్రకటన చేయడం రిపబ్లికన్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో కూడా మస్క్ భారీగా ఖర్చు చేస్తారని ట్రంప్ మద్దతుదారులు ఆశపడుతున్న తరుణంలో ప్రపంచ కుబేరుడు తన మనసులోని మాట బయటపెట్టి వారికి షాక్ ఇచ్చారు.

ట్రంప్ సర్కార్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సారధిగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ సంస్కరణలే లక్ష్యంగా చేపట్టిన చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలపై ఆయనకు ఆసక్తి తగ్గుతోందనే వాదన వినబడుతోంది. 
Elon Musk
Republican Party
Donald Trump
US Elections
Political Campaigns
Qatar Economic Forum
Funding
Midterm Elections
Government Efficiency
Political Spending

More Telugu News