Tarzan Lakshminarayana: బిస్కట్లు అయినా అమ్ముకోండి .. సినిమాను మాత్రం నమ్ముకోవద్దు!: నటుడు టార్జాన్

Tarzan lakshmi Narayana Interview
  • నటుడిగా 34 ఏళ్ల కెరియర్ 
  •  170కి పైగా సినిమాల అనుభవం 
  • పద్ధతులు మారిపోయాయన్న నటుడు 
  • కేవలం సినిమాను మాత్రమే నమ్ముకుంటే కష్టమని వెల్లడి      

సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంత ఆషామాషీ విషయమేం కాదు. ఈ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా ఉంటున్నవారు ఎంతో అనుభవంతో చెప్పిన మాట ఇది. తాజాగా నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ కూడా, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాటను చెప్పాడు. 34 ఏళ్ల కెరియర్ లో దాదాపు 170 పైకి సినిమాలలో ఆయన నటించాడు. విలన్ కి ప్రధానమైన అనుచరుడిగా ఆయన ఎక్కువ సినిమాలలో కనిపించాడు. 

టార్జాన్ మాట్లాడుతూ .. " ఇండస్ట్రీలో ఎవరికి సక్సెస్ ఉంటే వాళ్ల వెంటనే పడుతూ ఉంటారు. మిగతా వాళ్లను పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఫలానా పాత్ర ఫలానా వారే చేయాలని ఏమీ లేదు. ఎవరిని పడితే వారిని తీసుకుని వస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం తిరగలేదు. అవకాశం ఇస్తే చేస్తాను .. లేదంటే లేదు. ఆశించిన స్థాయిలో ఎదగకపోవడానికి అది ఒక కారణంగా చెప్పుకోవచ్చునేమో" అని అన్నాడు.

" పలకరిస్తే పట్టించుకోరు .. ఆఫీసుకు వెళితే .. ఉండి కూడా లేరని అనిపిస్తారు. చాలామందిలో అహంకారం పెరిగిపోయింది .. మమకారం తగ్గిపోయింది .. మంచితనం ఎప్పుడో చచ్చిపోయింది. ఒకప్పటి ప్రేమలు .. అభిమానాలు ఇప్పుడు లేవు. నేను కేవలం సినిమాను మాత్రమే నమ్ముకోకుండా బిజినెస్ కూడా చేస్తూ వెళ్లడం వలన ఫరవాలేదు. అందువల్లనే ఏవైనా బిజినెస్ లు చేస్తూ సినిమాలు చేసుకోమని సలహా ఇస్తూ ఉంటాను. అవకాశాలు ఎప్పుడు ఉంటాయో .. ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. అందుకే బిస్కట్లు అయినా అమ్ముకోండి .. కేవలం సినిమాను మాత్రం నమ్ముకోవద్దని చెబుతూ ఉంటాను" అని అన్నాడు.

Tarzan Lakshminarayana
Tollywood
Telugu cinema
Telugu film industry
movie opportunities
film career
actor interview
success in film industry
business advice
film industry struggles

More Telugu News