Hafiz Saeed: ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను పాక్ అప్పగించాల్సిందే: ఇజ్రాయెల్ లో భారత రాయబారి

Hafiz Saeed Must Be Handed Over by Pakistan Says Indian Envoy to Israel
  • ఆపరేషన్ సిందూర్ కు కేవలం విరామం మాత్రమే ప్రకటించామన్న జేపీ సింగ్
  • ఉగ్రవాదంపై పోరు ఆగదని స్పష్టీకరణ
  • పాక్ లోని నూర్ ఖాన్ స్థావరంపై దాడి గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్య
ఉగ్రవాదంపై భారత్ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తూ, అంతర్జాతీయ సమాజ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చాం కానీ, అది ముగిసిపోలేదు" అని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్, ఉగ్రవాదుల ఏరివేతలో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ముంబై 26/11 దాడుల సూత్రధారి తహవ్వుర్‌ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన తరహాలోనే... పాకిస్థాన్ లో తలదాచుకున్న హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ వంటి కీలక ఉగ్రవాదులను కూడా అప్పగించాలని జేపీ సింగ్ డిమాండ్ చేశారు. తాము కేవలం పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్థాన్ మాత్రం భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించిందని ఆయన ఆరోపించారు.

ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని తుదముట్టించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని జేపీ సింగ్ తేల్చిచెప్పారు. మే 10వ తేదీన నూర్ ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని "గేమ్ ఛేంజర్"గా అభివర్ణించిన ఆయన, ఈ ఘటనతో పాకిస్థాన్ లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, కాల్పుల విరమణ కోసం పాక్ డీజీఎంఓ భారత ప్రతినిధులను సంప్రదించారని వెల్లడించారు.
Hafiz Saeed
India Israel relations
JP Singh
Tahawwur Rana
Sajid Mir
Zakir Rehman Lakhvi
Operation Sindoor
Pakistan terrorism
Mumbai 26/11 attacks
Indian envoy

More Telugu News